బీబీ జోడి స్టేజి మీదకు ఈ వారం ఎపిసోడ్ లో బుట్టబొమ్మ టీం వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేసింది. అర్జున్ దాస్, నవ్య స్వామి, అనైక, సూర్య వచ్చారు. వాళ్ళతో కాసేపు ముచ్చట్లు అయ్యాకా ధమాకా టీం-పటాకా టీమ్ లోని లేడీస్ కి ఒక టాస్క్ ఇచ్చింది హోస్ట్ శ్రీముఖి. ఆ టాస్క్ లో గెలిచిన అమ్మాయికి "బుట్టబొమ్మ" టైటిల్ ఇవ్వాలని అర్జున్ కి చెప్పింది. అంతే కాదు అదనపు కండిషన్ అంటూ ఆ బుట్టబొమ్మకు లవ్ ప్రొపోజ్ చేయాలని కూడా అర్జున్ కి చెప్పింది.
తర్వాత సిక్స్ లేడీ కంటెస్టెంట్స్ కి రకరకాల మ్యూజిక్స్ ప్లే చేసి వినిపించారు.. లేడీస్ అంతా ఆ మ్యూజిక్స్ ని హమ్ చేశారు. ఐతే ఈ టాస్క్ లో ఇద్దరు విన్నర్స్ అంటూ అర్జున్ దాస్ కాసేపు కంటెస్టెంట్స్ ని కంగారు పెట్టి చివరికి "ఫైమా" కి బుట్టబొమ్మ టైటిల్ ని ఇచ్చాడు..అలాగే శ్రీముఖిని కూడా విన్నర్ గా ప్రకటించాడు. ఇప్పుడు ఇద్దరికీ లవ్ ప్రొపోజ్ చేయాలి అనే కండిషన్ ఉండడంతో శ్రీముఖి, ఫైమా ఇద్దరూ సిగ్గు పడుతూ స్టేజి మీద నిలబడ్డారు. కానీ అర్జున్ దాస్ ప్లేట్ ఫిరాయించి తన మూవీ హీరోయిన్ నవ్య స్వామిని పిలిచి మోకాళ్ళ మీద కూర్చుని ఆమె చేయి పట్టుకుని ప్రొపోజ్ చేసాడు. ఆ సీన్ చూసి అవినాష్ స్టేజి మీదకు వచ్చి వెటకారంగా నవ్వి వెళ్ళాడు.
ఇక శ్రీముఖి, ఫైమా ఇద్దరూ బాధపడుతూ బ్యాక్ గ్రౌండ్ లో "ఆడజన్మకు ఎన్ని శోకాలో" అని సాంగ్ పాడుకుంటూ కళ్ళ నీళ్లు తుడుచుకున్నారు. ఫైమా సీరియస్ గా చూస్తుండేసరికి "ఏం చూస్తున్నవే" అని శ్రీముఖి సీరియస్ అయ్యింది. " హి బ్రోకెన్ మై హార్ట్" అని అర్జున్ దాస్ వైపు చూస్తూ ఫన్నీ డైలాగ్ చెప్పేసరికి స్టేజి మీద అందరూ నవ్వేశారు.